Create New Playlist

Add a cover pic of your own choice

(Optional)

Name

AI Cover Generator

4 credits

Not enough credits (0/4).

Logout

Are you sure you want to Logout?

Close

New Blossoms 2 by sriramachandramurthy

SongGPT
New Blossoms 2 by sriramachandramurthy - Folk,both vocals music cover art

New Blossoms 2

Folk,both vocals

0:003:44
Lyrics
Description
కొమ్మకొమ్మకు క్రొత్త చిగురులు
తొడుగు టెట్టుల పికమెఱింగెనొ-----
మావి చిగురుల నారగించుచు---
కుహూగానము చేయసాగెను
మధువు దొరికే మాసమిదియని
గండు తుమ్మెద కెటుల తెలిసెనో---
పూల గుమ్మలు పులకరింపగ----
జుమ్ము జుమ్మని చేరికయ్యెను
కొమ్మకొమ్మకు క్రొత్త చిగురులు
తొడుగు టెట్టుల పికమెఱింగెనొ----
మావి చిగురుల నారగించుచు---'
కుహూగానము చేయసాగెను
పుష్పకేతువు పుడమి జేరుట
పూల తరువులు కెటుల తెలిసెనొ----
పూల తేరుకు వలయు పూలను---
సొగసు లలరగ సిగల దాల్చెను
కొమ్మకొమ్మకు క్రొత్త చిగురులు
తొడుగు టెట్టుల పికమెఱింగెనొ---
మావి చిగురుల నారగించుచు---'
కుహూగానము చేయసాగెను
రతిని దోకొని పంచబాణుడు
వెడలెనని శుకమెట్టులరసెనొ-----
రయము రయముగ రథము నడుపగ----
చెఱకువిలుతుని దరికి చేరెను
కొమ్మకొమ్మకు క్రొత్త చిగురులు
తొడుగు టెట్టుల పికమెఱింగెనొ---
మావి చిగురుల నారగించుచు---
కుహూగానము చేయసాగెను
అతివ ఆమని అరుగుదెంచుట
అడవితల్లికి ఎటుల తెలిసెనొ----
పల్లవంబుల తోరణంబులు----
కొల్లగా వని నెల్ల కట్టెను
కొమ్మకొమ్మకు క్రొత్త చిగురులు
తొడుగు టెట్టుల పికమెఱింగెనొ----
మావి చిగురుల నారగించుచు---
కుహూగానము చేయసాగెను
నవవసంతపు రాకవార్తలు
జంతుసంతతి కెటులతెలిసెనొ---
కుక్షిలో నక్షరము లేకయె ---
జీవతతి జేజేలు పలికెను
కొమ్మకొమ్మకు క్రొత్త చిగురులు
తొడుగు టెట్టుల పికమెఱింగెనొ---
మావి చిగురుల నారగించుచు----
కుహూగాన