Create New Playlist

Add a cover pic of your own choice

(Optional)

Name

AI Cover Generator

4 credits

Not enough credits (0/4).

Logout

Are you sure you want to Logout?

Close

Lal Salaam Anthem 1 by MOTAPALUKULA

SongGPT
Lal Salaam Anthem 1 by MOTAPALUKULA - Patriotic music cover art

Lal Salaam Anthem 1

Patriotic

0:003:34
Lyrics
Description
ఒక అల్లూరి,
ఒక భగత్ సింగ్
ఒక చంద్రశేఖర్ ఆజాదూ...
ఒక రాజగురూ...
ఒక సుఖదేవూ...
ఒక నంబాల కేశవరావు...
అందుకోరా... లాల్ సలామ్.
అరుణారుణ పతాకాల
లాల్ సలామ్.
మీరంటే జనావళికి అంతులేని ప్రియమూ.
మీరంటే పాలకులకు అలవి కానీ భయమూ.
స్వేచకొరకు క్రాంతి కొరకు ప్రాణాలను బలియిచ్చిన
దేశభక్తులారా...... అందుకోండి లాల్ సలామ్.
అల్లూరీ,...భగత్ సింగ్,...
నంబాల కేశవరావు....
అరుణారుణ పతాకాల
లాల్ సలామ్.
మీ త్యాగం వృథా కాదు కాదూ ....ఎన్నటికీ,
మీ లక్ష్యం మరిచిపోదు పోదు......
భరత జాతీ.
కష్టాలూ కన్నీళ్ళు సవాళ్లు ఎన్నెదురైనా,
మీ ఆశయ సాధనకై సాగుతుంది యువసైన్యం.
అల్లూరీ,...భగత్ సింగ్,...
నంబాల కేశవరావు....
అరుణారుణ పతాకాల
లాల్ సలామ్.
నాటి తెల్లవాడు నేటి నల్లవాడు అయినా,
మీరన్నా భయమే... మీశవమన్నా భయమే.
దేశద్రోహులన్నా మిమ్ము టెర్రరిస్టులన్నా,
నక్సలైట్లన్నా మీరు దేశభక్తులేనన్నా.
అల్లూరీ,...భగత్ సింగ్,...
నంబాల కేశవరావు....
అరుణారుణ పతాకాల
లాల్ సలామ్.
బ్రిటీషోడు బీజేపోడు ఆరెస్సెస్ ఒకటే,
దేశాన్ని దోచుకు తినే దోపిడీ దొంగలే.
మైనారిటీ దళితా బహుజనులు
ఆదివాసులకూ,కమ్యూనిస్టులకూ
ఆగర్భ శత్రువులే....
అల్లూరీ,...భగత్ సింగ్,...
నంబాల కేశవరావు....
అరుణారుణ పతాకాల
లాల్ సలామ్.
లాల్ సలామ్.లాల్ సలామ్.
అరుణారుణ పతాకాల
లాల్ సలామ్.