Create New Playlist

Add a cover pic of your own choice

(Optional)

Name

AI Cover Generator

4 credits

Not enough credits (0/4).

Logout

Are you sure you want to Logout?

Close

Batukamma Festivities 1 by Madhavi

SongGPT
Batukamma Festivities 1 by Madhavi - Folk,female vocals music cover art

Batukamma Festivities 1

Folk,female vocals

0:003:40
Lyrics
Description
పల్లవి.. పచ్చాని చేలన్నీ ఉయ్యాలో..
పసిడి పంటాలాయే ఉయ్యాలో..
ఘనమైన మా గౌరీ ఉయ్యాలో
బతుకమ్మ అయ్యేగా ఉయ్యాలో..
గూడంత తిరిగి ఉయ్యాలో
గునుగు పువ్వు తెస్తి
ఉయ్యాలో...,
చేనంత తిరిగి ఉయ్యాలో
చామంతులే తెస్తి ఉయ్యాలో
శివుని పట్టపురాణి ఉయ్యాలో
మా తల్లివే నీవు ఉయ్యాలో,
మూడు లోకాలకు ఉయ్యాలో
మూలపుటమ్మవే ఉయ్యాలో //పచ్చాని//
పిల్లా,పాపలను ఉయ్యాలో
కాపాడరావమ్మా ఉయ్యాలో,
కరుణించు మమ్ము ఉయ్యాలో
కాపాడు మమ్ము ఉయ్యాలో,
ఊరంత పండగే ఉయ్యాలో
వాడంతా వనమాయే ఉయ్యాలో.
ముక్కోటి దేవతలు ఉయ్యాలో
మురిసిపోయారమ్మా ఉయ్యాలో..
మాతల్లివే నీవు ఉయ్యాలో
మా అండవే నీవు ఉయ్యాలో //పచ్చాని//
పట్టుపావడాలు ఉయ్యాలో
పడచులంతా కట్టే ఉయ్యాలో,
పెట్టెలో పట్టుచీర ఉయ్యాలో
అవ్వ కట్టి మురిసే ఉయ్యాలో,
పత్తిపువ్వులెక్క ఉయ్యాలో
తాత నవ్వసాగే ఉయ్యాలో
పల్లె,పట్టణంలో ఉయ్యాలలో
ఊరువాడలల్ల ఉయ్యలో
ఘనంగా చేసిరి ఉయ్యలో
బతుకమ్మ పండుగ ఉయ్యలో //పచ్చాని//
ప్రతీ ఏడూ ఇట్టాగే ఉయ్యలో
నిను కొలిచేమమ్మ ఉయ్యలో
ఆరారుకాలాలు ఉయ్యలో
పచ్చాని పంటలు ఇయ్యలో
దేశమంతా నువ్వు ఉయ్యలో
సల్లగా సూడాలి ఉయ్యలో
మా తల్లి బతుకమ్మ ఉయ్యలో.. మా అందరి అండవే ఊయ్.. //పచ్చాని//